SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 3:35 pm Posted by : SALAM PRODDATUR

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ జిల్లా కోర్ కమిటీ భేటీ

 

–కార్యాచరణపై విస్తృత చర్చ

సలాం ప్రొద్దుటూరు –  కడప:

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ కడప జిల్లా కోర్ కమిటీ సమావేశం ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి సంయుక్త అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

 

సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకులు–కార్యకర్తల సమన్వయంపై విస్తృతంగా చర్చించారు.కార్యక్రమంలో బద్వేల్ ఎమ్మెల్యే డా. దాసరి సుధ, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, రామచంద్రరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, రాష్ట్ర పార్లమెంటరీ కార్యదర్శి కల్లూరు నాగేంద్రరెడ్డి, ఎస్ఈసీ సభ్యుడు మెట్టుపల్లి ప్రభాకర్ రెడ్డి, పలువురు నియోజకవర్గ ఇన్‌చార్జులు, మాజీ మేయర్లు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.