ముస్లింలు, దళితులను లక్ష్యంగా చేసుకుని కేంద్రం మత రాజకీయాలు
–కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజం సలాం ప్రొద్దుటూరు – కడప: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలు, క్రైస్తవులు, దళితులను లక్ష్యంగా చేసుకుని మత విద్వేషాన్ని ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ఆరోపించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.2014కు ముందు, ఆ తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ముస్లింలపై వివక్షకు పాల్పడుతున్నాయని ఆయన...