టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
–స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం సలాం ప్రొద్దుటూరు అమరావతి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ సోమవారం ప్రారంభమైంది. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో శిక్షణ, ఇంటరాక్టివ్ విధానంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కాంక్లేవ్‌లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. పార్టీ నాయకత్వ లక్షణాల పెంపొందింపు, క్షేత్రస్థాయిలో క్యాడర్‌తో సమన్వయం, ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ...