ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం
–రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని కడప జిల్లా నాయకుల పిలుపు సలాం ప్రొద్దుటూరు – కడప: ఆమ్ ఆద్మీ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పార్టీ కడప జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఆదివారం కడపలోని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు,...