SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 6:29 am Posted by : SALAM PRODDATUR

ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం

 

 

–రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని కడప జిల్లా నాయకుల పిలుపు

 

సలాం ప్రొద్దుటూరు –  కడప:

ఆమ్ ఆద్మీ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పార్టీ కడప జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఆదివారం కడపలోని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

 

రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు, పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు నాయకులు తెలిపారు. జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.

 

సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ కడప జిల్లా కన్వీనర్ సాజిద్ హుసేన్, కోఆర్డినేటర్ రహమతుల్లా, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ బిర్లా శ్రీనివాసులు, కో-కన్వీనర్ దాదాపీర్, వేంపల్లి ఆప్ మండల సభ్యులు మహమ్మద్ గౌస్, ఖదీర్, అల్లాబక్ష్ తదితరులు పాల్గొన్నారు.