సలాం ప్రొద్దుటూరు పొట్లదుర్తి:
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు సీ.ఎం. సురేష్ నాయుడు ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడటంతో కాలికి గాయమై, శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం పోట్లదుర్తి గ్రామంలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ రాఘవ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ లక్ష్మణ్ పరామర్శించారు.
ఈ సందర్భంగా సురేష్ నాయుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నేతలు, ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. అలాగే వైద్యులు సూచించిన మేరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
సురేష్ నాయుడికి అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బిరెడ్డి, జగన్ కొట్టాల తదితరులు పాల్గొన్నారు.