విధి నిర్వహణలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.2.5 లక్షల ఆర్థిక సాయం

  సలాం ప్రొద్దుటూరు –  కడప: విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ రూ.2.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.   బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. లక్ష్మీనారాయణ (హెచ్‌సీ-1180) కుటుంబానికి పోలీసు సంక్షేమంలో భాగంగా పోలీసు వితరణ నిధి నుంచి ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దివంగత...