సలాం ప్రొద్దుటూరు – పులివెందుల:
అమరావతిలో ఇటీవల నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ స్పోర్ట్స్ అండ్ డ్యూటీ మీట్‌లో పులివెందుల ట్రాఫిక్ సీఐ జి. ప్రసాదరావు ప్రతిభ కనబరిచారు.
డ్యూటీ మీట్‌లో భాగంగా నిర్వహించిన ‘శాస్త్రీయ దర్యాప్తు సహాయకాలు’ విభాగంలో కర్నూలు రేంజ్ తరఫున ప్రత్యేక బృంద సభ్యుడిగా ఆయన పాల్గొన్నారు. నేర దర్యాప్తులో శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి సంబంధించిన అంశాల్లో ఆయన ప్రతిభ కనబరిచినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ విభాగంలో కర్నూలు రేంజ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
అనంతరం ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ఆవరణలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో స్పోర్ట్స్ ఐజీ కేవీ మోహన్ రావు చేతుల మీదుగా సీఐ ప్రసాదరావు ట్రోఫీ, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా దర్యాప్తు విభాగంలో ప్రతిభ కనబరిచిన ప్రసాదరావును పోలీసు అధికారులు అభినందించారు.
