రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
–వ్యాయామ విద్య అధ్యాపకులకు ఘన సన్మానం సలాం ప్రొద్దుటూరు: ఉపాధ్యాయులు తమ బోధనతో విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు, మంచి నడవడికతో సమాజ మార్పుకు కృషి చేయాలని రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాధికారి డాక్టర్ ఏ. శంకర్‌రెడ్డి అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని లింగాపురం సమీపంలోని రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రవిశంకర్, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి...