జర్నలిస్టుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం
–2025 ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం.. –12 విభాగాల్లో పురస్కారాలు –₹1 లక్షల నుంచి ₹2 లక్ష వరకు నగదు బహుమతులు.. సెప్టెంబర్ 28లోగా దరఖాస్తులు సలాం ప్రొద్దుటూరు –విజయవాడ: జర్నలిజం రంగంలో విశేష సేవలందిస్తూ వృత్తిపరమైన ప్రతిభ కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి, వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి సంబంధించి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర సమాచార...