SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 1:06 am Posted by : SALAM PRODDATUR

ఘనంగా టీచర్స్ డే వేడుకలు

 

సలాం ప్రొద్దుటూరు:

స్థానిక శ్రీ సాయి రాజేశ్వరి బి.ఎడ్. కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సోదుం బాలిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ వీర కుమార్ రెడ్డి, కరస్పాండెంట్ బసిరెడ్డి వీర కళ్యాణ్ రెడ్డి, ఎస్.ఆర్.ఐ.టి. ప్రిన్సిపాల్ డాక్టర్ పాండురంగన్ రవి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గంగావతి తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

 

టీచర్స్ డే సందర్భంగా కళాశాల అధ్యాపకులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి ఉత్సాహపరిచారు. పోటీల్లో విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.