గురువులే భావి తరాల బాటసారులు
–తొండూరు హైస్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సలాం ప్రొద్దుటూరు – తొండూరు: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మచ్చా వెంకట రమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవిత విశేషాలు, విద్యారంగానికి అందించిన సేవలు, దేశానికి...