ఆపరేషన్ ‘మొబీ ట్రాక్’లో కడప పోలీసుల సరికొత్త రికార్డు
–60 రోజుల్లో 531 చోరీ, పోయిన మొబైల్ ఫోన్ల రికవరీ –ఇప్పటివరకు 7,018 మొబైల్స్ స్వాధీనం.. మొత్తం విలువ రూ.13.73 కోట్లు సలాం ప్రొద్దుటూరు –కడప: సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ కడప జిల్లా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ మొబీ ట్రాక్’ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. కేవలం 60 రోజుల వ్యవధిలో 531 పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించి రికవరీ చేశారు. రికవరీ చేసిన ఫోన్ల అంచనా విలువ రూ.1.06...