విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులు
–విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకోవాలి – కళాశాల ప్రిన్సిపాల్ డా. పాండురంగన్ రవి సలాం ప్రొద్దుటూరు: విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సాయి రాజేశ్వరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్‌ఆర్‌ఐటీ) ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పాండురంగన్ రవి అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న కళాశాలలో టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి...