విద్యార్థుల భద్రత కోసం సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ పోరాటం ఫలించింది
–పాఠశాల సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె ఏర్పాటు సలాం ప్రొద్దుటూరు–జమ్మలమడుగు: విద్యార్థులు, స్థానిక ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాల సమీపంలోని ప్రమాదకర విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె ఏర్పాటు చేయాలని గతంలో సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాలు చేసిన విజ్ఞప్తికి అధికారులు స్పందించారు. పెద్దపసుపుల మోటు బాలాజీ స్కూల్ కాంపౌండ్ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తాజాగా రక్షణ కంచె ఏర్పాటు చేయడంతో సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.గత కొన్ని నెలల క్రితం సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పట్టణ...