రూ.12 కోట్లతో 50 అభివృద్ధి పనులు

  –ప్రొద్దుటూరు పట్టణంలో డ్రైన్లు, పైప్‌లైన్లు, రోడ్ల అభివృద్ధికి శ్రీకారం   –సెప్టెంబర్ 6న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం   సలాం    ప్రొద్దుటూరు: పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రత్యేక అభివృద్ధి కార్యాచరణ చేపట్టారని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతుల ఆధారంగా పట్టణంలోని వివిధ వార్డుల్లో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, వాటికి...