“రాచమల్లు అన్న నన్ను అమ్మ అంటారు.. మీరు నన్ను బొమ్మ అంటున్నారు”?

  – బొర్రా రామాంజనేయులు వ్యాఖ్యలపై మాజీ మునిసిపల్ చైర్మన్ భీమునపల్లి లక్ష్మీదేవి ఆగ్రహం   సలాం   ప్రొద్దుటూరు: “రాచమల్లు అన్న నన్ను ఎప్పుడూ ‘అమ్మా’ అని గౌరవంగా పిలుస్తారు.. మీరు మాత్రం నన్ను ‘బొమ్మ’ అంటున్నారు. మహిళల పట్ల ఇదేనా మీ గౌరవం?” అని ప్రొద్దుటూరు మాజీ మునిసిపల్ చైర్మన్ భీమునపల్లి లక్ష్మీదేవి ప్రశ్నించారు.   తనకు మునిసిపల్ చైర్మన్ పదవి లభించిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, తనను బీసీ మహిళగా గుర్తించి గౌరవంతో పదవి ఇచ్చారని ఆమె తెలిపారు. పదవిలో ఉన్న సమయంలో...