“రజకులకు మీకు ఎందుకు స్టోర్‌?” అంటూ మమ్మల్ని అవమానించారు

    –ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తీరుపై వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోటూరు వెంకటేష్‌ ఆగ్రహం   సలాం    ప్రొద్దుటూరు: రజక సామాజిక వర్గానికి స్టోర్‌ ఏర్పాటు చేయాలని గతంలో కోరిన సమయంలో తమను అవమానించేలా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడారని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోటూరు వెంకటేష్ ఆరోపించారు. ప్రస్తుతం రాజకీయ విమర్శల పేరుతో బీసీ వర్గాలను రాజకీయాలకు అడ్డం పెట్టుకోవడం సరికాదని ఆయన అన్నారు.   గోటూరు వెంకటేష్‌ మాట్లాడుతూ.. తాను గత 18 ఏళ్లుగా...