ముస్లిం మత గురువు ముల్లా హబీబుల్లా మృతి
–25 ఏళ్లుగా మత, సామాజిక సేవల్లో విశిష్ట సేవలు సలాం ప్రొద్దుటూరు –చాపాడు: చాపాడు మండలం చాపాడు గ్రామానికి చెందిన ప్రముఖ ముస్లిం మత గురువు ముల్లా హబీబుల్లా అనారోగ్య కారణాలతో శనివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి వార్త తెలియగానే చాపాడు మండల వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు, సోదరీమణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముల్లా హబీబుల్లా గత 25 సంవత్సరాలుగా చాపాడు మండల ముస్లిం సమాజానికి మత గురువుగా సేవలందించారు. మతపరమైన కార్యక్రమాలతో...