మహిళా జర్నలిస్టులపై లాఠీచార్జీని ఖండించిన ఎంపీజే

    –పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలి   సలాం   ప్రొద్దుటూరు: ఢిల్లీలో ముస్లిం మహిళా జర్నలిస్టులపై పోలీసుల లాఠీచార్జీని మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) ప్రొద్దుటూరు శాఖ తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడటం పత్రికా స్వేచ్ఛ, మహిళల గౌరవం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎంపీజే నాయకులు పేర్కొన్నారు.   చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగానికి, చట్టానికి విధేయులుగా పనిచేయాలని వారు డిమాండ్ చేశారు....