బీసీలకు పదవులిచ్చి.. రాజకీయంగా ప్రోత్సహించాం
–బీసీలకు గౌరవం, అవకాశాలు కల్పించింది వైఎస్సార్‌సీపీయే: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి రాజకీయ విమర్శలను స్వీకరిస్తా.. కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తే సహించను సలాం ప్రొద్దుటూరు: తన రాజకీయ ప్రస్థానం 1996లో ప్రారంభమై, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజాసేవ స్ఫూర్తితో ఈ స్థాయికి చేరుకున్నానని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రజాసేవ చేయాలనే ఆకాంక్షతో తన మేనమామ సహకారంతో రాజకీయాల్లోకి వచ్చానని, తాను డిగ్రీ గ్రాడ్యుయేట్‌నని తెలిపారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, రాజకీయ జీవితంలో ఎలాంటి దాపరికాలు లేవని పేర్కొన్నారు. శుక్రవారం...