SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 6:04 pm Posted by : SALAM PRODDATUR

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

–శ్రీకృష్ణాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

 

సలాం   ప్రొద్దుటూరు:

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణాలయంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ఆలయానికి చేరుకుని శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.అనంతరం ఆలయ నిర్వాహకులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, బాలసుబ్బరాయుడుతో పాటు పలువురు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని, ఇతర ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.