వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలి
–వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళల పెన్షన్లు రెండున్నరేళ్లుగా నిలిపివేత –ఆందోళనకు సిద్ధమవుతున్న ఐద్వా సలాం ప్రొద్దుటూరు: వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు రెండున్నరేళ్లుగా నిలిచిపోయిన పెన్షన్లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) డిమాండ్ చేసింది. ప్రొద్దుటూరులోని ఐద్వా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐద్వా కార్యదర్శి జి. ప్రేమ, అధ్యక్షురాలు వై. విజయమ్మ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 30 నెలలు కావస్తున్నప్పటికీ, ఇప్పటివరకు అనేక మంది...