రాజగోపాల్ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు –బేపారి జాకీర్

  –బీసీల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం   సలాం    ప్రొద్దుటూరు: టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్‌పై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అన్నారు. గురువారం ప్రొద్దుటూరులో జరిగిన బీసీ నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.   ఈ సందర్భంగా జాకీర్ మాట్లాడుతూ.. రాజగోపాల్ యాదవ్‌పై అహంకారపూరితంగా, అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కాదన్నారు....