ఆధునిక హంగులతో ప్రొద్దుటూరు ఎస్‌డీపీఓ కార్యాలయం
–ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలే లక్ష్యం.. –దాతల సహకారం అభినందనీయం.. – జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సలాం ప్రొద్దుటూరు : పోలీస్ అధికారులు, సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కల్పించడంతో పాటు, సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం అందించేందుకు ప్రొద్దుటూరు ఎస్‌డీపీఓ కార్యాలయాన్ని ఆధునిక సదుపాయాలతో పునరుద్ధరించారు. పునరుద్ధరించిన కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో మౌలిక వసతులను బలోపేతం చేయడం...