పండుగల వేళ ప్రైవేట్‌ బస్సుల దోపిడీని అరికట్టాలి

    –ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యంపై సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో ధర్నా   సలాం  ప్రొద్దుటూరు: పండుగల సందర్భంగా ప్రైవేట్‌ బస్సు యాజమాన్యాలు ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ప్రొద్దుటూరు ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, మున్సిపల్‌ యూనియన్‌ కార్యదర్శి సాల్మన్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ నివసించే పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు...