SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 12:35 am Posted by : SALAM PRODDATUR

కర్నూలులో ఘనంగా ఈద్-ఏ-మిలాద్ ఉన్ నబీ ﷺ వేడుకలు

ప్రవక్త మహమ్మద్ ﷺ బోధనలు మానవాళికి శాంతి, సోదరభావానికి మార్గదర్శకం

 

సలాం ప్రొద్దుటూరు–కర్నూల్:

పవిత్ర ఈద్-ఏ-మిలాద్ ఉన్ నబీ ﷺ సందర్భంగా కర్నూలు చిన్న మార్కెట్‌లోని బర్గాహ్-ఏ-హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ ఖాలిక్ మహమ్మద్ మహమ్మదుల్ హుస్సేనీ చిష్తీ ఉల్ ఖాదిరీ లింగ్బంద్ జగత్‌గురు రహ్మతుల్లాహి అలైహి వద్ద జల్సా-ఏ-మిలాద్ ఉన్ నబీ ﷺ కార్యక్రమాన్ని ఘనంగా బుధవారం రాత్రి జరిగింది.ఈ కార్యక్రమానికి పీర్-ఏ-తరీకత్ ఖ్వాజా సయ్యద్ షా మసూం పీర్ హుస్సేనీ, సజ్జాదా నషీన్, ముతవల్లి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తర్జుమాన్-ఏ-ఖాదిరియత్ హజ్రత్ అల్లామా మౌలానా సయ్యద్ రిజ్వాన్ పాషా ఖాదిరీ సాహెబ్ పాల్గొన్నారు.అలాగే సయ్యద్ అథర్ పాషా ఖాదిరీ సాహెబ్ (జీ.బీ. మస్జిద్ ముతవల్లి), సయ్యద్ నూర్ ఉల్ హసన్ హుస్సేనీ (లాల్ మస్జిద్ ముతవల్లి), జనషీన్-ఏ-సజ్జాదా నషీన్ సయ్యద్ షా ఖాలిక్ పీర్ హుస్సేనీ, సయ్యద్ షా అబ్దల్ హుస్సేనీ, హాఫిజ్ సయ్యద్ షా అక్మల్ పీర్ హుస్సేనీ, మౌలానా హాఫిజ్ సయ్యద్ షుజాఉద్దీన్ అహ్మద్ ఖాదిరీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు ప్రవక్త మహమ్మద్ ﷺ పవిత్ర జీవితం, ఆయన బోధించిన ప్రేమ, కరుణ, సహనం, సోదరభావం, శాంతి, మానవత్వం వంటి మహోన్నత విలువలను వివరించారు. సమాజంలో పరస్పర గౌరవం, ఐక్యతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.ఈద్-ఏ-మిలాద్ ఉన్ నబీ ﷺ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు, ప్రవక్త మహమ్మద్ ﷺపై నాత్‌లు, ప్రసంగాలతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.ప్రవక్త మహమ్మద్ ﷺ చూపిన శాంతి, ప్రేమ, మానవత్వ మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించడమే నిజమైన మిలాద్ సందేశమని  పేర్కొన్నారు.