కరోనా వేళ ప్రాణాలు పణంగా పెట్టాం.. ఇప్పుడు హక్కుల కోసం పెన్‌డౌన్!
–జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు వైద్య, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది నిరసన –“అర్హులైన వారిని క్రమబద్ధీకరించాలి.. 100 శాతం గ్రాస్ పే, ఈపీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలి” సలాం ప్రొద్దుటూరు: కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందించిన కాంట్రాక్టు వైద్య, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పెన్‌డౌన్ నిరసన కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్ కడప మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్...