ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం
–జమ్మలమడుగులో పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహణ సలాం ప్రొద్దుటూరు – జమ్మలమడుగు: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పశువుల ఆరోగ్యం, పశుగ్రాసం, నీటి నిర్వహణ మరియు వేడి ఒత్తిడి నివారణపై రైతులు, పారా వెట్స్‌కు అవగాహన కల్పించేందుకు పశువైద్య కళాశాల, ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో బుధవారం పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం, జమ్మలమడుగులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. జి.ఆర్.కె. శర్మ గారు, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డా. వీరబ్రహ్మయ్య గారు, అసిస్టెంట్ డైరెక్టర్ డా....