SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 12:49 am Posted by : SALAM PRODDATUR

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాచమల్లు

 

 

–పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినేతతో నేతల భేటీ

 

 సలాం ప్రొద్దుటూరు – పులివెందుల:

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.  పులివెందులలో జరిగిన ఈ భేటీలో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితో పాటు కడప జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి నరసింహారెడ్డి, రాష్ట్ర పార్లమెంటరీ కార్యదర్శి కల్లూరు నాగేంద్రరెడ్డిలు కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు అంశాలపై నాయకుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. స్థానికంగా పార్టీ కార్యకలాపాలు, నాయకులు–కార్యకర్తల పరిస్థితులు తదితర అంశాలపై కూడా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.వైఎస్‌ జగన్‌ను కలిసిన సందర్భంగా నాయకులు పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.