మట్కా స్థావరంపై వన్‌టౌన్ పోలీసుల మెరుపుదాడి

    –నలుగురు బీటర్ల అరెస్ట్.. –రూ.9 వేల నగదు, 4 మట్కా స్లిప్పులు స్వాధీనం   సలాం  ప్రొద్దుటూరు: మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు కొనసాగుతున్న ప్రత్యేక నిఘాలో భాగంగా ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో మట్కా నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో మట్కా రాస్తున్నారన్న సమాచారంతో వన్‌టౌన్ ఎస్‌ఐ...