పేదల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం
–ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాలతో పెన్షన్ల పంపిణీ సలాం ప్రొద్దుటూరు – మైదుకూరు: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు పట్టణ ప్రధాన కార్యదర్శి రాకెట్ రఫీ, ఐటీడీపీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్ హుస్సేన్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కూటమి...