SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 12:12 am Posted by : SALAM PRODDATUR

పేదల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం

 

 

–ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాలతో పెన్షన్ల పంపిణీ

 

సలాం ప్రొద్దుటూరు – మైదుకూరు: 

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు పట్టణ ప్రధాన కార్యదర్శి రాకెట్ రఫీ, ఐటీడీపీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్ హుస్సేన్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు.