జాతీయ లోక్ అదాలత్‌పై ముందస్తు సమావేశం
–ట్రాఫిక్ చలాన్లతో పాటు రాజీ కాగల కేసుల పరిష్కారానికి చర్యలు సలాం ప్రొద్దుటూరు – కడప: సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ముందస్తు సమావేశం నిర్వహించారు. కడప న్యాయ సేవా సదన్‌లో జరిగిన ఈ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రామగోపాల్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా నూతన ప్రధాన జిల్లా న్యాయమూర్తి జి. రామగోపాల్‌కు పుష్ప మొక్కను అందజేసి స్వాగతం పలికారు....