కుళాయి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం సహించం

  –బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. నిర్లక్ష్య సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు   –సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ప్రత్యేక పన్ను వసూలు డ్రైవ్: కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్   సలాం  ప్రొద్దుటూరు: కుళాయి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ హెచ్చరించారు. పట్టణంలో కుళాయి పన్నుల వసూళ్ల పరిస్థితిపై బుధవారం తన కార్యాలయంలో వార్డు మౌలిక సౌకర్యాల కార్యదర్శులతో ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...