ఇడుపులపాయలో మార్మోగిన వైఎస్సార్ స్మరణ

–మహానేతకు ఘన నివాళి.. షర్మిల ప్రత్యేక ప్రార్థనలు –వైఎస్సార్ ఆశయాలే కాంగ్రెస్‌కు మార్గదర్శకం: ఇర్ఫాన్ భాషా సలాం ప్రొద్దుటూరు  ఇడుపులపాయ: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహానేతను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీటి నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల ప్రత్యేక ప్రార్థనలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు...