SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 11:18 am Posted by : SALAM PRODDATUR

25వ వార్డులో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

సలాం  ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి ,టీడీపీ యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు 25వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం చేపట్టారు.టీడీపీ మైనారిటీ నాయకుడు నూరి ఆధ్వర్యంలో వార్డులో ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేయడంతో వృద్ధులు, వితంతువులు, ఇతర అర్హత కలిగిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నూరి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి, టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి సూచనల మేరకు కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకులు సీఎస్ ఇస్మాయిల్, సచివాలయ సిబ్బంది నాయబ్ రసూల్, అంజి, బాబు తదితరులు పాల్గొన్నారు.