SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 5:11 pm Posted by : SALAM PRODDATUR

ప్రభుత్వ సేవల్లో.. సమాచార శాఖ పాత్ర అత్యంత కీలకం..!

 

–సమాచార శాఖ జోన్‌-4 ఆర్జేడీ ఎం. వెంకటేశ్వర ప్రసాద్‌

 

సలాం ప్రొద్దుటూరు –  కడప :

అక్షరాస్యత పెంపు, పేదరిక నిర్మూలన, వ్యవసాయాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో సమాచార శాఖ పాత్ర అత్యంత కీలకమని జోన్‌-4 ఆర్జేడీ ఎం. వెంకటేశ్వర ప్రసాద్‌ అన్నారు. మంగళవారం కడపలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని.. జోన్‌-4 ఆర్జేడీ ఎం. వెంకటేశ్వర ప్రసాద్‌ తనిఖీ చేశారు. కార్యాలయంలోని పరిపాలనా అంశాలను పరిశీలించి, శాఖాపరంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలు, సిబ్బంది విధులపై వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బందితో సమావేశమై వారి విధులు, బాధ్యతలపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ముఖ్యంగా అక్షరాస్యత పెంపు, పేదరిక నిర్మూలన, వ్యవసాయాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన వంటి రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, వాటి ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తికి కీలక వేదికలుగా మారాయని, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, వాటిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా సమాచారాన్ని అందించాలన్నారు.ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయుల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని, మీడియా ప్రతినిధులు వాస్తవ సమాచారాన్ని బాధ్యతాయుతంగా ప్రజలకు అందించాలని కోరారు. జోన్‌-4 పరిధిలో సమాచార శాఖను మరింత పటిష్టం చేయడంతో పాటు పాత్రికేయులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సిబ్బంది తమ విధులను బాధ్యతతో నిర్వర్తిస్తూ శాఖ ప్రతిష్ఠను పెంపొందించేలా పనిచేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఏడి రమేష్, డీఇఐఇ శ్రీనివాసరావు, పిఆర్వో రవికుమార్, ఏవీఎస్ నాగయ్య, సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా తదితరులు ఆర్జేడీ ఎం. వెంకటేశ్వర ప్రసాద్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి, దుశ్శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్లు సదాశివయ్య, కృపాకర్, ఫోటోగ్రాఫర్ సొహైల్, టైపిస్టులు శ్రీవాణి, వర్ధిని, రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మీపతి, అజ్మతుల్లా, టీఏ హరిబాబు, వీరారెడ్డి, విజయ కుమారి, షాహీనా బేగం, ముంతాజ్ బేగం, సునీత, సుభాషిణి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.