పేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా.. పారదర్శకంగా పింఛన్ల పంపిణీ

–ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలందించడమే లక్ష్యం– కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ –14,094 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ.6.21 కోట్ల పింఛన్ల పంపిణీ సలాం  ప్రొద్దుటూరు: ప్రజలకు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. మంగళవారం స్థానిక 6వ వార్డు సచివాలయం పరిధిలోని డ్రైవర్ కొట్టాల ప్రాంతంలో జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నేరుగా...