దువ్వూరు విద్యాసంస్థల్లో డీవైఈఓ శివప్రసాద్‌ తనిఖీలు

    –పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై కీలక సూచనలు.. ప్రైవేటు పాఠశాలల్లో వసతులపై ఆరా   సలాం ప్రొద్దుటూరు –దువ్వూరు: ప్రొద్దుటూరు డివిజనల్‌ ఉప విద్యాశాఖ అధికారి (DyEO)  శివప్రసాద్‌ దువ్వూరు మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (ZPHS)ను సందర్శించి పాఠశాల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని అన్ని తరగతి గదులను స్వయంగా పరిశీలించి, బోధన–అభ్యసన ప్రక్రియను సమీక్షించారు.ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన డీవైఈఓ, రానున్న పబ్లిక్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పాటించాల్సిన విధానాలు,...