SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 8:08 pm Posted by : SALAM PRODDATUR

దువ్వూరు విద్యాసంస్థల్లో డీవైఈఓ శివప్రసాద్‌ తనిఖీలు

 

 

–పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై కీలక సూచనలు.. ప్రైవేటు పాఠశాలల్లో వసతులపై ఆరా

 

సలాం ప్రొద్దుటూరు –దువ్వూరు:

ప్రొద్దుటూరు డివిజనల్‌ ఉప విద్యాశాఖ అధికారి (DyEO)  శివప్రసాద్‌ దువ్వూరు మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (ZPHS)ను సందర్శించి పాఠశాల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని అన్ని తరగతి గదులను స్వయంగా పరిశీలించి, బోధన–అభ్యసన ప్రక్రియను సమీక్షించారు.ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన డీవైఈఓ, రానున్న పబ్లిక్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పాటించాల్సిన విధానాలు, సమయపాలన, నిరంతర సాధన, పునశ్చరణ వంటి అంశాలపై విలువైన సూచనలు చేశారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు.అనంతరం దువ్వూరు మండలంలోని ప్రైవేటు పాఠశాలలను కూడా డీవైఈఓ శివప్రసాద్‌ పర్యవేక్షించారు. తరగతి గదులు, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. విద్యార్థుల భద్రత, విద్యా ప్రమాణాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.ఈ పర్యటనలో మండల విద్యాశాఖ అధికారులు MEO-1 శ్రీ రమణయ్య, MEO-2 శ్రీ భాస్కర్‌ పాల్గొని పాఠశాలల పరిస్థితులను పర్యవేక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.