టైటిల్‌ కోసం తుది సమరం.. యోగివేమన vs ఎస్‌ఆర్‌ఐటీ

  –టీఎన్‌ఎస్‌ఎఫ్ క్రికెట్ టోర్నమెంట్‌ ఫైనల్‌కు టీడీపీ నేతలు సలాం ప్రొద్దుటూరు: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో టీఎన్‌ఎస్‌ఎఫ్ కడప జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 29, 30, 31 తేదీల్లో ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా యూజీ, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.మొత్తం 16 జట్లు ఈ టోర్నమెంట్‌లో హోరాహోరీగా తలపడగా, ఫైనల్‌కు యోగివేమన ఇంజినీరింగ్ కళాశాల, ఎస్‌ఆర్‌ఐటీ జట్లు అర్హత సాధించాయి....