క్రీడా స్ఫూర్తికి వేదికగా.. టీడీపీ–టీఎన్‌ఎస్‌ఎఫ్ క్రికెట్ టోర్నమెంట్
–సెమీఫైనల్లో యోగివేమన ఇంజినీరింగ్ కళాశాల జయభేరి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా రేవంత్ సలాం ప్రొద్దుటూరు: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ.. యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో యోగివేమన ఇంజినీరింగ్ కళాశాల జట్టు అద్భుతమైన ఆటతీరుతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో...