ఖర్గేపై కుల వివక్ష దుర్మార్గం

    –రాహుల్‌ గాంధీపై కేసు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే– ఇర్ఫాన్‌ బాషా   సలాం  ప్రొద్దుటూరు: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రాంలీలా మైదానంలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పర్యటించిన అనంతరం సభా ప్రాంగణాన్ని శుద్ధి చేయడాన్ని కాంగ్రెస్‌ నాయకుడు ఇర్ఫాన్‌ బాషా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన బహిరంగ కుల వివక్షకు, అంటరానితన భావజాలానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.జాతీయ స్థాయి నాయకుడిగా, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే పట్లే ఇలాంటి వివక్షాపూరిత...