“మీ హయాంలోనే కార్పొరేట్లకు స్వాగతం.. ఇప్పుడు విమర్శలా?”
–రాచమల్లు వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఘాటు కౌంటర్ –“ఉపాధి, అభివృద్ధిని అడ్డుకోవడమేనా మీ విధానం?” సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో కార్పొరేట్ సంస్థల రాకపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేస్తున్న విమర్శలకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. రాచమల్లు హయాంలోనే పలు కార్పొరేట్ సంస్థలు పట్టణంలోకి వచ్చాయని, ఇప్పుడు అదే సంస్థలను రాజకీయంగా విమర్శించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు.శుక్రవారం నెహ్రూ రోడ్డులోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వరదరాజులరెడ్డి మాట్లాడుతూ, “మీ పాలనలో...