–మస్జిద్ అభివృద్ధికి శాశ్వత ఆదాయ వనరులే లక్ష్యం– డా. ముక్తియార్
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణం బొల్లవరం మస్జిద్‌కు సంబంధించిన స్థలంలో నూతన వ్యాపార సముదాయ గదుల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు అంజుమన్ అహలె ఇస్లాం కమిటీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా డా. ముక్తియార్ మాట్లాడుతూ, మస్జిద్‌కు సంబంధించిన స్థలాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపార సముదాయ గదులను నిర్మించడం ద్వారా మస్జిద్ నిర్వహణ, అభివృద్ధికి భవిష్యత్తులో నిరంతర ఆదాయ వనరును సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.మస్జిద్ అభివృద్ధితో పాటు ముస్లిం సమాజ సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, అందరి సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఆయన పేర్కొన్నారు. మతపరమైన సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు సమకూర్చడం ద్వారా వాటి నిర్వహణ మరింత సులభతరం అవుతుందని తెలిపారు.భూమిపూజ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక ముస్లిం పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసి వ్యాపార సముదాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.మస్జిద్ అభివృద్ధి, నిర్వహణకు శాశ్వత ఆదాయ వనరును ఏర్పాటు చేసే దిశగా ఈ నిర్మాణం కీలక అడుగుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.