–లక్ష్య సాధనకు క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి– ఎస్పీ విభూ కృష్ణ
–విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన బి.ఆర్. షఫీ ప్రసంగం.. ఆకట్టుకున్న ఫ్లాష్‌మాబ్
సలాం ప్రొద్దుటూరు:
సాయి రాజేశ్వరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్‌ఆర్‌ఐటీ) ఇంజనీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రథమ సంవత్సరం బీటెక్, డిప్లొమా, ద్వితీయ సంవత్సరం లాటరల్ ఎంట్రీ విద్యార్థులకు కళాశాల విద్యా విధానం, అవకాశాలు, లక్ష్య నిర్దేశం, భవిష్యత్ ప్రణాళికలపై అవగాహన కల్పించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొద్దుటూరు ఎస్పీ విభూ కృష్ణ ఐపీఎస్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. తమ ప్రతిభను సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి నూతన విద్యార్థులకు స్వాగతం పలికి కళాశాలలో లభించే విద్యా, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను వివరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పాండురంగన్ రవి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యలో మొదటి సంవత్సరం ఎంతో కీలకమని, స్పష్టమైన లక్ష్యంతో నిరంతరం కృషి చేయాలని అన్నారు.కరస్పాండెంట్ వీర కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగం సాధించడమే కాకుండా సృజనాత్మకత, నూతన ఆలోచనలు, నైపుణ్యాలను పెంపొందించుకుని మంచి ప్రొఫెషనల్స్‌గా, బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ప్రముఖ మోటివేషన్ స్పీకర్, లైఫ్ కోచ్ బి.ఆర్. షఫీ తన ప్రేరణాత్మక ప్రసంగంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. లక్ష్య సాధన, కష్టపడి పనిచేయడం, వైఫల్యాలను అధిగమించడం వంటి అంశాలపై స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు.అనంతరం విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో చైర్మన్ బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వీర కుమార్ రెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ గంగావతి రెడ్డి, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
