“హెల్మెట్ పెట్టుకోండి.. ఇంటికి క్షేమంగా చేరండి!”
–అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సలాం ప్రొద్దుటూరు: రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలనే సందేశంతో ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీసులు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ఎన్. భాస్కర్ ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణపై విద్యార్థులకు వివరించారు. “ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం!” ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ...