ప్రొద్దుటూరు డబ్బు.. ప్రొద్దుటూరులోనే! –రాచమల్లు
–కార్పొరేట్ దూకుడుతో స్థానిక వ్యాపారులకు కష్టాలు –“మన ఊరి వ్యాపారులను మనమే ఆదరించాలి.. మన ఆర్థిక వ్యవస్థను మనమే కాపాడుకోవాలి” — రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సలాం ప్రొద్దుటూరు: ఒకప్పుడు పత్తి, నూనె, బంగారం వంటి అనేక రకాల వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రొద్దుటూరు.. నేడు కార్పొరేట్ సంస్థల విస్తరణతో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక వ్యాపారులను ప్రజలు ప్రోత్సహించాలని, స్థానికంగా పుట్టి పెరిగిన వ్యాపార వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత...