SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 12:01 am Posted by : SALAM PRODDATUR

కడప గడ్డపై టీడీపీ సమన్వయ శంఖారావం

 

–జిల్లా పార్టీ బలోపేతంపై నేతల మంతనాలు.. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

 

సలాం ప్రొద్దుటూరు –  కడప:

కడప ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో తెలుగుదేశం పార్టీ కడప జిల్లా స్థాయి కమిటీ సమన్వయ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేయడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షులు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. వి.ఎస్. ముక్తియార్తో పాటు టీడీపీ కడప పార్లమెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.జిల్లా స్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతూ టీడీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నాయకులు సమావేశంలో దిశానిర్దేశం చేశారు.